రాష్ట్రపతి భవన్ లో ప్రతి శనివారం నిర్వహించే ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్ ‘ కార్యక్రమం ఈ సారి కొత్త విధానంలో నిర్వహించారు. సైనిక విన్యాసాలు, సెరిమోనియల్ మిలిటరీ బ్రాస్ బ్యాండ్ ను కూడా ఈ వేడుకలో భాగం చేశారు. ఇక పై ఈకార్యక్రమం ఇదే విధంగా సరికొత్త విధానంలో జరగనుంది. విశాల మైదానంలో సంగీత వాయిద్యాల మధ్య వీనుల విందైన ప్రదర్శనలతో జరగనుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇక తాజాగా జరిగిన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ వీక్షించారు. ఫిబ్రవరి 22 నుండి ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో సందర్శకులను అనుమతించనున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి భవన్ లో ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్ ‘ కార్యక్రమాన్ని 2007 నుండి ఒక వేడుకగా జరుపుతున్నారు. వారం వారం రాష్ట్రపతి గార్డ్స్ గా కొత్త దళం బాధ్యతలు చేపడుతుంది. 2012 నుండి ప్రజలను కూడా ఈ కార్యక్రమం వీక్షించేందుకు అనుమతిస్తున్నారు. సందర్శకులు రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్ లో తమ స్లాట్ లు బుక్ చేసుకోవచ్చు.
రాష్ట్రపతి భవన్ లో సరికొత్త విధానంలో సాగనున్న ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్’ కార్యక్రమం
By admin1 Min Read