తిరుపతిలోని పారిశుధ్య కార్మికులు నివసించే స్కావెంజర్స్ కాలనీ నగర మున్సిపల్ కమిషనర్ మౌర్య చూపిన చొరవతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిని ఆకర్షించింది. దాదాపు 300 కుటుంబాలు నివసించే ఆ ప్రాంతం ఒకప్పుడు మురికివాడ లాగా ఉండగా నగరం మున్సిపల్ కమిషనర్ మౌర్య చూపిన శ్రద్ధతో ఆవిడ తీసుకున్న చర్యలతో పరిశుభ్రంగా మారడంతో పాటు అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈమేరకు ఒక దినపత్రికలో వచ్చిన వార్తను తన పోస్ట్ కు జత చేశారు. స్వచ్ఛాంధ్ర మన లక్ష్యం…. ఆ దిశగా సాగాలి మన ప్రయాణం. మార్పుకు కారణమైన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు అభినందనలంటూ సీఎం ట్వీట్ చేశారు.
స్వచ్ఛాంధ్ర మన లక్ష్యం…. ఆ దిశగా సాగాలి మన ప్రయాణం.
మార్పుకు కారణమైన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు అభినందనలు.#SwarnaAndhraSwachhAndhra pic.twitter.com/xmOoJvtrAM
— N Chandrababu Naidu (@ncbn) February 17, 2025