ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సుదీర్ఘ కాలం తరువాత దేశ రాజధాని ఢిల్లీ అధికార పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ ఎంపిక చేసింది. తొలిసారి షాలిమార్‌బాగ్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తా ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం తనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతగా పని చేస్తానని రేఖా గుప్తా పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.తనపై విశ్వాసం ఉంచి సీఎంగా బాధ్యతలు అప్పగించారని, పార్టీ అధిష్ఠానానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో బీజేపీ నుండి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుండి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అతిశీ మహిళా ముఖ్యమంత్రులుగా పని చేశారు.
ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతగా పని చేస్తా: సీఎం రేఖా గుప్తా
By admin1 Min Read
Previous Articleఏపీ సీఎం చంద్రబాబుతో పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ సమావేశం
Next Article హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్-72 పోటీలు