అమెరికా ఎఫ్‌బీఐ సంస్థ డైరెక్టర్‌గా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కశ్యప్ పటేల్ నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో ఆయన ‘ఎక్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికన్లకు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే సహించేది లేదని అన్నారు.ఎఫ్‌బీఐ తొమ్మిదో డైరెక్టర్‌గా తనను నియమించడం ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని కాశ్ పటేల్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఎఫ్‌బీఐ దర్యాప్తు ఏజెన్సీ.. పారదర్శకత, బాధ్యత, న్యాయానికి మారు పేరు అని, ఆ సంస్థను పునర్ నిర్మించనున్నట్లు తన పోస్టులో కాశ్ పటేల్ వివరించారు.కాశ్ పటేల్ పేరును అలస్కాకు చెందిన రిపబ్లికన్లతో పాటు పలువురు డెమోక్రట్లు వ్యతిరేకించారు.అయితే, 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం జరిగింది.