గత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ భారత్ లో ఎవరినో గెలిపించడానికి రూ.182 కోట్లు విడుదల చేశారని ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. ఓటింగ్ పెంచడం ద్వారా భారత ఎన్నికలలో జోక్యం చేసుకునేందుకు యూఎస్ ఎయిడ్ (USAID) ప్రయత్నించిందనే వార్తలు పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సంబంధిత విభాగాలు దృష్టి పెట్టినట్లు తెలిపింది. యూ.ఎస్ కార్యకలాపాలు, నిధులకు సంబంధించి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం తెలిపిన సమాచారాన్ని చూశామని అవి తీవ్ర కలవరపెడుతున్నాయని ముఖ్యంగా భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళనకు దారితీశాయని పేర్కొన్నారు. ఇప్పుడు దీనిపై బహిరంగంగా మాట్లాడడం తొందరపాటు అవుతుందని సంబంధిత అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పూర్తి సమాచారం వచ్చాక దీనిపై మరిన్ని వివరాలు తెలియపరుస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం..యూఎస్ ఎయిడ్ వ్యవహారంపై స్పందించిన భారత్..!
By admin1 Min Read
Previous Articleస్టార్ ఆఫ్ ఇండియాగా అల్లు అర్జున్..!
Next Article ఆఫ్ఘనిస్తాన్ పై సౌతాఫ్రికా ఘనవిజయం