ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ పై 107 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. రికెల్టన్ 103 (106; 7×4, 1×6) సెంచరీతో రాణించగా…బావుమా 58 (76; 5×4), వాన్ డెర్ డస్సెన్ 52 (42; 3×4, 2×6), మర్క్రమ్ 52నాటౌట్(36; 6×4, 1×6) హాఫ్ సెంచరీలతో కదంతొక్కడంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ 2 వికెట్లు, ఫరూకీ, అజ్మతుల్లా, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు. ఇక టార్గెట్ చేధించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటయింది. రహ్మత్ షా 90 (92; 9×4, 1×6) ఒక్కడే చెప్పుకోదగిన ప్రదర్శన కనబరిచాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా 3 వికెట్లు, ఎంగిడి 2 వికెట్లు, వియన్ ముల్డర్ 2 వికెట్లు, మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు