ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 23 తేదీన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.అయితే రేపు జరగనున్న ఈ పరీక్షను కొన్ని రోజులు వాయిదా వేయాలంటూ…రాష్ట్ర ప్రభుత్వం నేడు ఏపీపీఎస్సీకి లేఖ రాసింది.2 ఏళ్ళ క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయంటూ…అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, గ్రూప్-2 మెయిన్స్ కొన్ని రోజుల తరువాత నిర్వహించాలని ఏపీపీఎస్సీకి రాసిన లేఖలో వెల్లడించింది.
అయితే రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని,ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.కాగా రోస్టర్ విషయంపై కోర్టులో ఉన్న పిటిషన్ మార్చి 11న విచారణకు రానుండగా,కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఇంకా సమయం ఉందని ప్రభుత్వం పేర్కొంది.అప్పటివరకు పరీక్ష నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి సూచించింది.