1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ స్పెషల్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది.అయితే ఈరోజు శిక్షను ఖరారు చేసింది.కాగా 4 దశాబ్దాల క్రితం జరిగిన అల్లర్ల సమయంలో సరస్వతి విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌ను హతమార్చారన్న కేసులో ఆయనను కోర్టు ఇటీవల దోషిగా తేల్చింది.ఈ కేసుకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ ఇప్పటికే తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.అతనిపై మరో రెండు కేసులు న్యాయస్థానాలలో పెండింగులో ఉన్నాయి.
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు…!
By admin1 Min Read