కేంద్ర ప్రభుత్వం తమపై హిందీ భాషను రుద్దడంపై..మరో భాషా యుద్ధానికి రాష్ట్రం సిద్ధమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు.సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…లోక్‌సభ స్థానాల పునర్విభజన అంశాన్ని చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నట్టు స్టాలిన్ చెప్పారు.కాగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని తమిళనాడు విజయవంతంగా అమలు చేసిన కారణంగా…8 లోక్‌సభ స్థానాలను కోల్పోయే ముప్పును రాష్ట్రం ఎదుర్కొంటోందని స్టాలిన్ పేర్కొన్నారు.అయితే నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాదిపై కత్తి వేలాడుతోందని స్టాలిన్ అన్నారు.