నేడు పవిత్ర మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు శైవ క్షేత్రాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భారీగా భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు. దేవాదాయ శాఖ అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక మహా శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.భక్తిశ్రద్ధలతో మహా శివరాత్రి పండుగను జరుపుకుంటున్న తెలుగువారందరినీ ఆ మహాదేవుడు కరుణించి, శుభాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ పార్వతీ, పరమేశ్వరుల దీవెనలతో అందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను#Mahashivratri2025 pic.twitter.com/tYHSSqyNjF
— N Chandrababu Naidu (@ncbn) February 26, 2025