జాతీయ ఎస్సీ కమీషన్‌లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కాంగ్రెస్ ఎంపీ ,ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.ఆయన ఈ మేరకు ఈరోజు ఎక్స్ లో పోస్టు చేస్తూ … ఈ పోస్టులను భర్తీ చేసి దళితుల హక్కులు, ప్రయోజనాలను కాపాడాలని ఆయన ప్రధాని మోదీని కోరారు.కాగా ఎస్సీ కమీషన్ అనేది ఓ రాజ్యాంగ బద్దమైన సంస్థ అని,దాన్ని బలహీనపరచడం అంటే,రాజ్యాంగంపై దాడి చేయడమే అని, దళితుల సామాజిక హక్కుల్ని కాలరాసినట్లు అవుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
అయితే బీజేపీ కావాలనే ఎస్సీ కమీషన్‌లో ఉన్న ఖాళీలను నింపడం లేదని విమర్శించారు. ప్రస్తుతం ఏడాదిగా ఎస్సీ కమీషన్‌లో 2 కీలక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు.ఎస్సీ కమీషన్‌లో తక్షణమే పోస్టులను భర్తీ చేయాలని,అప్పుడే ఆ సంస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు.ప్రస్తుతం ఎస్సీ కమీషన్ అధిపతిగా కిషోర్ మక్వానా ఉన్నారు.దీనిలో వైస్ చైర్మెన్, ఓ సభ్యుడి పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
भाजपा सरकार की दलित विरोधी मानसिकता का एक और सबूत देखिए!
दलितों के अधिकारों की रक्षा करने वाले राष्ट्रीय अनुसूचित जाति आयोग को जानबूझकर उपेक्षित कर दिया गया है – इसके दो अहम पद पिछले एक साल से ख़ाली पड़े हैं।
यह आयोग एक संवैधानिक संस्था है – इसे कमज़ोर करना दलितों के संवैधानिक…
— Rahul Gandhi (@RahulGandhi) February 28, 2025

