మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి.కాగా పాకిస్థాన్‌కు చెందిన ఫోన్ నెంబర్ నుండి ఈ బెదిరింపులు వచ్చాయని సమాచారం.ఈ మేరకు మహారాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,ఈరోజు ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా బెదిరింపు సందేశం వచ్చింది.అయితే సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ అందులో హెచ్చరించారని పోలీసులు తెలిపారు.వాట్సాప్ మెసేజ్ చేసిన వ్యక్తిని మాలిక్ షాబాజ్ హుమాయున్‌గా గుర్తించారు.బెదిరింపు సందేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం క్యాంపు కార్యాలయం, వివిధ ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు