ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లా మనా గ్రామంలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 7 కు పెరిగింది.రెస్క్యూ సిబ్బంది మంచుదిబ్బల కింద నుండి ఈరోజు మరో 3 మృతదేహాలను వెలికితీశారు.దీనితో మొత్తం మృతుల సంఖ్య 7కు చేరింది.కాగా 2 రోజుల క్రితం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికుల శిబిరంపై మంచు చరియలు విరిగిపడ్డాయి.వెంటనే సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.ఆచూకీ దొరకని మరో మృతదేహం కోసం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. బీఆర్వో కార్మికులు మంచు తొలగించే పనుల్లో ఉండగా మంచు చరియలు విరిగిపడి 58 మంది అందులో కూరుకుపోయారు.అయితే వెంటనే ఆర్మీ, సహాయక బృందాలు రంగంలోకి దిగి 54 మందిని కాపాడారు.వారిని ఎయిర్‌లిఫ్ట్‌తో జోషి మఠ్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.వారిలో తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులు చికిత్స పొందుతూ మృతిచెందారు.
Previous Articleరుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ గుర్తింపును తొలగింపు…!
Next Article మాయావతి సంచలన నిర్ణయం…మేనల్లుడికి షాక్ ..!