ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే ఆ మ్యాచ్ లో మొహ్మద్ షమీ మంచి నీళ్ళు తాగుతూ కనిపించారు.కాగా రంజాన్ ఉపవాస వేళ షమీ కూల్ డ్రింక్ తాగడాన్ని కొంతమంది వివాదంగా మార్చారు.ఈ మేరకు రంజాన్ మాసంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో మహ్మద్ షమీ డ్రింక్ తాగడం షరియా ప్రకారం నేరమని ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు ప్రెసిడెంట్ మౌలానా షహాబుద్దీన్ రిజ్వీ అన్నారు.మొహమ్మద్ షమీ మ్యాచ్ సమయంలో ఎనర్జీ డ్రింక్ తాగాడు. షమీ శారీరకంగా ఫిట్‌గా ఉన్నాడు అయినప్పటికి ఆయన ఉపవాసం పాటించకుండా బహిరంగంగా ఎనర్జీ డ్రింక్ తాగడమే కాకుండా..ఉపవాసాన్ని పాటించలేదని ముస్లిం మండిపడ్డాడు.షరియత్ దృష్టిలో, అతను నేరస్థుడు.అతన్ని అల్లా కచ్చితంగా శిక్షిస్తాడని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ చెప్పుకొచ్చాడు.అయితే అల్లాను షమీ క్షమాపణ వేడుకోవాలని డిమాండ్ చేశాడు.
కాగా ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో షమీ అభిమానులతో పాటు, క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.షమీ భారతీయుడని, దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇవన్నీ లెక్కలోకి రావని ఎన్సిపి ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తెలిపారు.ముల్లాలు ముందు మతగ్రంథాలను సరిగ్గా చదవాలని షమీ బ్రదర్ జైద్ సూచించారు.పాక్ జట్టంతా డ్రింక్స్ తాగడం కనిపించలేదా అని ప్రశ్నించారు.