మంగళసూత్రం ధరించని,బొట్టు పెట్టుకోని మహిళ పట్ల ఏ భర్త అయినా…ఎందుకు ఆసక్తి చూపుతాడని పుణె జిల్లా న్యాయమూర్తి ఓ మహిళను నిలదీశారు.ఈ మేరకు భర్త తనపై గృహ హింసకు పాల్పడినట్లు ఆ మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో నడుస్తున్న కేసులో న్యాయమూర్తి మధ్యవర్తిగా వ్యవహరించారు.కాగా న్యాయవాది జహగిరిధర్ ఆ మహిళకు, జడ్జికి మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే ఆ భార్య-భర్తలు ఇద్దరు కొద్ది రోజుల క్రితమే విడిపోయారు.అయితే వారి సమస్యను సామరస్యంగా పరిష్కరించి, ఇద్దరినీ కలిపేందుకు జడ్జి ప్రయత్నించారు.ఇందులో భాగంగా ‘నువ్వు మంగళ సూత్రం ధరించలేదు.నుదిటిపై సింధూరం కూడా పెట్టుకోలేదు.పెళ్లి అయినా మహిళల ప్రవర్తించకుండా, వీటిని ధరించకుండా ఉంటే నీ భర్త, నీ పట్ల ఎందుకు ఆసక్తి చూపాలని జడ్జి ఆమెను ప్రశ్నించారు.