ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ… మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మొదట్లో ఓ పైలట్….కానీ ఆయన చదువుకునే రోజుల్లో రెండు సార్లు పరీక్షలు తప్పారు. రాజీవ్ తో కలిసి నేను కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాను.కేంబ్రిడ్జ్ లో ఆయన ఫెయిల్ అయ్యారు.విచిత్రమైన విషయం ఏమిటంటే…కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పాస్ అవడం చాలా తేలిక అన్నారు….ఎందుకంటే, కేంబ్రిడ్జ్ వర్సిటీకి ఎంతో గొప్ప పేరుంది. ఫెయిలైన వాళ్లు ఎక్కువ మంది ఉంటే విద్యాసంస్థకు చెడ్డపేరు వస్తుందని, అక్కడ ప్రతి ఒక్కరినీ పాస్ చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు.
అలాంటి చోట కూడా రాజీవ్ గాంధీ ఫెయిల్ అయ్యారు.ఆ తర్వాత లండన్ లోని ప్రఖ్యాత ఇంపీరియల్ కాలేజిలో చేరాడు.అక్కడ కూడా ఫెయిల్…అందుకే నాకనిపిస్తుంటుంది…ఇలాంటి వ్యక్తి ఎలా ప్రధానమంత్రి కాగలిగాడు?” అంటూ మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ ఆ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో మణిశంకర్ అయ్యర్ నిరాశతో, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ…మణిశంకర్ అయ్యర్ బీజేపీకి ‘స్లీపర్ సెల్’ గా పనిచేస్తున్నారని విమర్శించారు.

