నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాగా, దీని అమలుపై కేంద్ర ప్రభుత్వం తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కొందరు దీనిని సమర్థిస్తున్నారు…మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా, తాజాగా రాజ్యసభ ఎంపీ ప్రముఖ సంఘసేవకురాలు సుధామూర్తి త్రిభాషా విధానానికి మద్దతు పలికారు. ఒక వ్యక్తి పలు భాషలు నేర్చుకోవాలని తాను భావిస్తున్నానని చెప్పారు. పిల్లలు ఎక్కువ భాషలు మాట్లాడడం మంచిదేనని అన్నారు. తనకు 7-8 భాషలు వచ్చని పేర్కొన్నారు. చాలా మంది ఇటువంటి అభిప్రాయానికి మద్దతు పలుకుతున్నారు.
పలు భాషలు నేర్చుకోవడం మంచిదే… నాకు 8భాషలు వచ్చు: ఎంపీ సుధా మూర్తి
By admin1 Min Read