వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యానికి గురైన 20 నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయి.మేఘాలయలోని బైర్నిహాట్ తొలి స్థానంలో నిలిచింది.ఢిల్లీ ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధానిగా గుర్తింపు పొందింది.ఈ నివేదికను స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ రూపొందించింది.2023లో భారత్ ప్రపంచంలో మూడో అత్యంత కాలుష్య దేశంగా ఉండగా,2024 నాటికి ఐదో స్థానానికి చేరుకుంది. దేశంలోని పీఎం2.5 సాంద్రత 2023లో 54.4 మైక్రోగ్రాములు ఉంటే, 2024లో 50.6కి తగ్గింది. అయితే,ఢిల్లీలో మాత్రం కాలుష్యం పెరిగి 108.3 మైక్రోగ్రాములకి చేరింది.బైర్నిహాట్, ముల్లన్‌పుర్, ఫరీదాబాద్, నోయిడా, గురుగ్రామ్ సహా పలు నగరాలు టాప్-20 జాబితాలో ఉన్నాయి.పరిశ్రమలు, వాహనాలు, పంట వ్యర్థాల దహనం కాలుష్యానికి ప్రధాన కారణాలు.డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలను మించిపోయే స్థాయిలో భారత నగరాల్లో వాయు కాలుష్యం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు