త్రిభాషా విధానం అమలు విషయంలో కేంద్రం,తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుండగా,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.అయితే తమిళనాడు హిందీని వ్యతిరేకిస్తూనే…హిందీలో సినిమాలు విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.ఈ వ్యాఖ్యలపై డీఎంకే అధికార ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా స్పందిస్తూ…తమ రాష్ట్ర ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
డీఎంకే సీనియర్ నేత ఎళన్‌గోవన్ తమిళనాడు భాషా విధానం 1938 నుండి స్థిరంగా ఉందని, 1968లో ద్విభాషా విధానాన్ని చట్టబద్ధం చేశామని గుర్తు చేశారు.ద్విభాషా విధానాన్నే అమలు చేస్తామని 1968లో రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని కూడా ఆమోదించుకున్నాం. విద్యా నిపుణుల సలహాలు, సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ బిల్లు పాస్ అయినప్పటికీ పవన్ కల్యాణ్ పుట్టి ఉండరు. తమిళ రాజకీయాలపై పవన్ కు అవగాహన లేకపోయి ఉండొచ్చు’ అని విమర్శించారు.