దేశంలో కులగణన (క్యాస్ట్ సెన్సెస్) చేయాలని పలు పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా కుల గణన అంశంపై కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కాన్షీరామ్ జయంతి సందర్భంగా సోషల్ మీడియా’ఎక్స్’ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. ఈసందర్భంగా కులగణన చేయాలని పేర్కొన్నారు. సమగ్రాభివృద్ధికి జనగణన అవసరమని మాయావతి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం దీనిని విస్మరించకూడదని కులగణన చేయకుంటే అది సుపరిపాలన కాబోదని అభిప్రాయపడ్డారు. కులగణన చేయకపోవడంపై ఒక పార్లమెంటరీ కమిటీ కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. యూపీలో 80 శాతం మంది బహుజనులు ఉన్నారని, ఇలాంటి చోట్ల కులగణన చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
కులగణన చేయాలి… కేంద్రం ఆదిశగా చర్యలు తీసుకోవాలి: బీఎస్పీ అధినేత్రి మాయావతి
By admin1 Min Read