స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు 8 స్వర్ణాలు, 18 రజతాలు మరియు 7 కాంస్యాలతో సహా 33 పతకాలతో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా భారత్ చేరుకున్న వారిని ప్రధాని మోడీ కలిశారు. పార్లమెంటులో ఈ బృందాన్ని కలిసి, వారి విజయాలకు అభినందనలు తెలిపారు. ఇటలీలోని టురిన్‌లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌లో దేశానికి కీర్తిని తెచ్చిన మన అథ్లెట్ల పట్ల ఎంతో గర్వపడుతున్నట్లు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలిపారు. స్పెషల్ ఒలింపిక్స్ లో భారత్ ఆల్పైన్ స్కైయింగ్ లో 10 మెడల్స్, స్నోషూయింగ్ లో 10 మెడల్స్, స్నో బోర్డింగ్ లో 6 మెడల్స్, షార్ట్ ట్రాక్ స్పీడ్ ట్రాకింగ్ లో 4 మెడల్స్, క్రాస్ కంట్రీ స్కైయింగ్ లో 2 మెడల్స్, ఫ్లోర్ బాల్ లో ఒక మెడల్ లభించాయి.
స్పెషల్ ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన అథ్లెట్ల బృందాన్ని కలిసి అభినందించిన ప్రధాని మోడీ
By admin1 Min Read

