అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, శాసన మండలి చైర్మన్ మోషేస్ రాజు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు గ్రూప్ ఫోటోలు దిగారు. ముందుగా ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎమ్మెల్సీల ఫొటో సెషన్ జరిగింది. ఇక ఈ ఫోటో సెషన్ సందర్భంగా మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఫొటో సెషన్ ముగించుకుని వెళుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆత్మీయంగా పలకరించారు. ‘ఎలా ఉన్నారు? బాగున్నారా?’ అని బొత్స పలకరించారు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.

అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫొటో సెషన్… పవన్ కు బొత్స ఆత్మీయ పలకరింపు
By admin1 Min Read

