మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండే పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒక కార్యక్రమంలో పాల్గొన్న కునాల్ కమ్రా శిండే పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమం జరిగిన హోటల్ పై దాడి చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కమెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కునాల్ పై కేసు రిజిస్టర్ అయింది. ఇక ఉద్ధవ్ శివసేన-శిండే శివసేనల మధ్య ఈ తాజా ఘటనతో మాటాల యుద్దం నడుస్తోంది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం శిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమెడియన్
By admin1 Min Read

