ట్రాఫిక్ పోలీసులు మండు వేసవిలో తీవ్ర గాలుల మధ్య విధులు నిర్వహించాల్సి రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై అవడి ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లను ప్రవేశపెట్టారు. ఈ ప్రత్యేక హెల్మెట్లు మైనస్ 15 డిగ్రీల చల్లదనాన్ని, 10 డిగ్రీల వెచ్చదనాన్ని అందించగలవు. ఇవి మెడకు దిగువ భాగంలో మూడు రెట్ల చల్లదనాన్ని కలిగిస్తాయని అధికారులు తెలిపారు. అవడి సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ మాట్లాడుతూ, ఈ హెల్మెట్ల వల్ల తలనొప్పి, అలసట వంటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ఏసీ ఆన్ చేసినప్పుడు స్వల్ప వైబ్రేషన్ అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. అవడి పరిధిలో 334 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం 50 మందికి మాత్రమే ఈ హెల్మెట్లు అందజేశామని తెలిపారు. వీటి పనితీరును పరిశీలించిన అనంతరం మిగిలిన వారికి కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు