పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా కోల్‌కతా మసీదుకు వెళ్లి ముస్లిం మతపెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.”వామపక్ష, కాషాయ పార్టీలు కలిసి పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు రెచ్చగొడుతున్నారు” అని ఆరోపించారు.మేం శాంతి, సామరస్యాన్ని పాటిస్తున్నాం అని, ప్రజల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. “ముస్లింల రక్షణ మెజారిటీ ప్రజల బాధ్యత” అని,అందరూ కలిసే ఉండాలని పిలుపునిచ్చారు.
మోతాబరి హింస గురించి స్పందిస్తూ, అల్లర్లకు పాల్పడేవారిపై పట్టుదలగా చర్యలు తీసుకుంటామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలు హింసను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.మార్చి 27న మాల్దా జిల్లా మోతాబరిలో ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసుల ప్రకారం, 61 మందిని అరెస్టు చేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఏడీజీ జావెద్ షామిం తెలిపారు.ఈ హింసను నిరసిస్తూ బీజేపీ శుక్రవారం ఆందోళన చేపట్టింది. “వామపక్షం, కాషాయం కలిసి పనిచేస్తున్నాయి” అని మమతా బెనర్జీ ఆరోపించడం రాజకీయం వేడెక్కించింది.