భద్రతా దళాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశాలలో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈరోజు నుండి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించిన తర్వాత శాంతి భద్రతలను నెలకొల్పాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. 13 పోలీస్ స్టేషన్ల రేంజ్ ను మినహాయించి మణిపూర్ లో ఈ యాక్టు పూర్తిగా అమలు కానుంది. నాగాలాండ్ లోని 8 జిల్లాల్లో పూర్తిగా, ఇతర జిల్లాల్లో 21 పోలీస్ స్టేషన్లు మరియు అరుణాచల్ ప్రదేశ్ లో మూడు జిల్లాలు పూర్తిగా, మరో జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతం ఈ చట్టం రేంజ్ లో ఉండనున్నాయి. 2024 సెప్టెంబర్లో మణిపూర్ ని 6 జిల్లాల్లో ఆరు నెలల పాటు అఫ్సా విధించారు. ఇది ఈ ఏడాది మార్చి 31న ముగియనుంది. అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న హింస కారణంగా మరోసారి అఫ్సా అమలు చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు