జాతీయ విద్యా విధానం (NEP)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై కేంద్రం మరియు తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది.తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దడం కరెక్ట్ కాదని స్పష్టంగా వ్యతిరేకిస్తోంది.ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ,తమిళనాడు ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వివాదాన్ని లేపుతోందని ఆరోపించారు.యూపీలోని పాఠశాలల్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి భాషలు బోధిస్తుంటే రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగిందా? అని ప్రశ్నించారు. త్రిభాషా విధానం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, యువత భవిష్యత్తుకు ఇది మేలు చేస్తుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానం ద్వారా విద్యార్థులు భిన్న భాషలు నేర్చుకోవాలని ఉద్దేశించినా,తమిళనాడు ప్రభుత్వం మాత్రం తమ భాషా స్వాభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిని వ్యతిరేకిస్తోంది.ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
మా రాష్ట్రంలో విద్యార్థులకు తమిళం, తెలుగు భాషలను నేర్పిస్తున్నాం : యూపీ సీఎం యోగి
By admin1 Min Read