సైబర్ నేరగాళ్లు మరోసారి తమ కుట్రలతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. రిటైర్డ్ కల్నల్ దలీప్ సింగ్,ఆయన భార్య రవీందర్ కౌర్ బజ్వా చండీగఢ్‌లో నివాసం ఉంటూ భారీ మోసానికి గురయ్యారు.ఈడీ అధికారులు అంటూ నమ్మించి, వాట్సాప్ కాల్స్ ద్వారా బెదిరిస్తూ వారి పొదుపు చేసిన రూ.3.4 కోట్లను నేరగాళ్లు కాజేశారు.మార్చి 18న అనుమానాస్పద నంబర్ నుంచి కాల్ వచ్చినప్పటి నుంచి మార్చి 27 వరకు దంపతుల్ని డిజిటల్ అరెస్టు చేసి,ఎవరి సంప్రదింపులు లేకుండా కట్టడి చేశారు.న్యాయపత్రాలను చూపించి ముంబైలో అకౌంట్ ఉందని,మనీ ల్యాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని భయపెట్టారు.తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ దంపతులు చివరకు వివిధ ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేశారు.అయితే,తన కుమారుడి స్నేహితుడిని సంప్రదించిన తర్వాత మోసాన్ని గుర్తించారు. దేశానికి సేవ చేసిన తన వృద్ధాప్యంలో జీవిత పొదుపును కోల్పోయిన బాధను దలీప్ సింగ్ వ్యక్తం చేశారు.అయితే,పోలీసులపై నమ్మకంతో తన డబ్బు తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు.
డిజిటల్ అరెస్టు మోసం…3.4 కోట్ల పోగొట్టుకున్న రిటైర్డ్ కల్నల్ దంపతులు…!
By admin1 Min Read