పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌కు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. టీచర్ల నియామక కుంభకోణం కేసులో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, 2016లో నియమించిన 25,753 మంది టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేసింది. అయితే, ఈ ఉద్యోగులు ఇప్పటివరకు పొందిన వేతనాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.గతేడాది ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేస్తూ, అక్రమ నియామకాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా రిక్రూట్‌మెంట్ చేపట్టాలని పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను (SSC) ఆదేశించింది. 2016లో 24,640 ఖాళీల కోసం పరీక్ష నిర్వహించగా, 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ తీర్పుతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెరగనుంది. అక్రమ నియామకాల కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతుందని అంచనా.కోర్టు తీర్పుతో ప్రభావితమైన ఉపాధ్యాయులు ఇకపై తమ భవిష్యత్తు ఏమిటన్న ఆందోళనలో ఉన్నారు.
పశ్చిమబెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
By admin1 Min Read