కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ‘బుల్‌డోజ్’ చేశారని మండిపడ్డారు. ఈ బిల్లును రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించిన ఆమె, ప్రభుత్వం ప్రతిపక్షాలకు తగినంత చర్చా సమయం ఇవ్వలేదని ఆరోపించారు.ఈ వివాదాస్పద బిల్లును బుధవారం లోక్‌సభలో 12 గంటలపాటు చర్చించిన అనంతరం ఓటింగ్ ద్వారా ఆమోదించారు. బిల్లుకు అనుకూలంగా 282 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 232 ఓట్లు నమోదయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఓటింగ్ ముగిసింది.కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా మాట్లాడుతూ, రాజ్యసభలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.ప్రతిపక్షాల సమన్వయంతో ఈ బిల్లును తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందని ఆమె ఆరోపించారు.నేడు ఈ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.రాజ్యసభలో ప్రభుత్వం మెజారిటీ కలిగి ఉండటంతో ఈ బిల్లుపై ప్రతిపక్షాల వ్యూహం కీలకంగా మారనుంది.
Previous Articleకంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్టే..!
Next Article సన్ రైజర్స్ హైదరాబాద్ కు హ్యాట్రిక్ ఓటమి..!

