సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలు కొనసాగుతున్నాయి. జట్టు మరోసారి పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. దారుణమైన ఫీల్డింగ్, కీలక బ్యాటర్లు విఫలమవడం ఆ జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించాయి. మరోవైపు కోల్ కతా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 60 (29; 7×4, 3×6), రఘవన్షీ 50 (32; 5×4, 2×6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ రహానే 38 (27; 1×4, 4×4), రింకూ సింగ్ 32 (17; 4×4, 1×6) పరుగులు చేసి ఆ జట్టు 200 పరుగులు చేయడంలో తమ వంతు కృషి చేశారు. హైదరాబాద్ బౌలర్లలో షమీ, కమ్మిన్స్, అన్సారీ, హార్షల్ పటేల్, కమిందు ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసిన్ (33), కమిందు మెండీస్ (27) మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వైభవ్ అరోరా 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, రస్సెల్ 2 వికెట్లు, సునీల్ నరైన్ ఒక వికెట్ తీశారు.
Previous Articleవక్ఫ్ సవరణ బిల్లుపై సోనియా గాంధీ విమర్శలు…!
Next Article ఐపీఎల్ లో కోల్ కతా అరుదైన ఘనత..!