వివాదాస్పదమైన వక్ఫ్ (సవరణ) బిల్లు–2025కు పార్లమెంట్ రెండూ సభల ఆమోదం లభించింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి వరకు సాగిన చర్చ అనంతరం బిల్లు ఆమోదించబడింది.ఓటింగ్‌లో 128 మంది బిల్లుకు అనుకూలంగా 95 మంది వ్యతిరేకంగా ఓటేశారు.లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదించబడిన సంగతి తెలిసిందే. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, పారదర్శకత పెంపు ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
కాంగ్రెస్, డీఎంకే, సీపీఎం, ఆప్, వైసీపీ వంటి పార్టీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్షాలు బిల్లును రాజ్యాంగ విరుద్ధమంటూ విమర్శించాయి. కేంద్రం మాత్రం ముస్లిం హక్కులను పరిరక్షించేందుకు తాము కట్టుబడినట్టు తెలిపింది. ప్రస్తుతం బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు.