కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ స్టార్టప్ మహా కుంభ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా స్టార్టప్‌ల మధ్య వ్యత్యాసం గురించి ఆయన మాటలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. మన దేశంలోని చాలా స్టార్టప్స్ ఫుడ్ డెలివరీ వంటి తదితర యాప్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టాయని, కానీ చైనాలోని స్టార్టప్‌లు మాత్రం వీటికి భిన్నంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్‌లు ఫుడ్ డెలివరీ యాప్స్ పై దృష్టి పెట్టాయి. దీంతో దేశంలో దిగువ శ్రేణి కార్మికులు తయారై సంపన్నులు కాలు బయటపెట్టకుండా ఫుడ్ పొందగలుతున్నారు. అంతకుమించి ఏంలేదు. అయితే ఇదే సమయంలో చైనా స్టార్టప్ సంస్థలు ఏఐ, ఈవీలు, సెమీ కండక్టర్ల సెక్టార్ లను ఎంచుకుంటున్నాయని తెలిపారు. భారత్‌లో డీప్-టెక్ స్టార్టప్‌లు లిమిటెడ్ గా వస్తున్నాయని, ఆ సెక్టార్ లో కేవలం 1,000 స్టార్టప్‌లు మాత్రమే ఉండటం ఆందోళనకరమని అన్నారు. ఇక్కడి యువతరం గొప్ప ఆలోచనలు రూ.25 లక్షలు, రూ. 50 లక్షలకు విదేశీ కంపెనీలకు వెళ్లిపోతున్నాయి. కొత్త స్టార్టప్ లు భవిష్యత్ తరాల కోసం దేశాన్ని సిద్ధం చేయాలి. మనం ఐస్ క్రీం, చిప్స్ అమ్మడం దగ్గరే ఆగిపోకూడదని పేర్కొన్నారు.
ఐస్ క్రీం, చిప్స్ దగ్గర ఆగిపోకూడదు…స్టార్టప్స్ పై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు
By admin1 Min Read
Previous Article76 వేల దిగువకు సెన్సెక్స్…23 వేల దిగువకు నిఫ్టీ
Next Article వక్ఫ్ సవరణ బిల్లు-2025కి పార్లమెంట్ ఆమోదం