రామేశ్వరాన్ని తమిళనాడుతో కలుపుతూ నిర్మించిన అత్యాధునిక పంబన్ రైలు వంతెనను రేపు (శ్రీరామనవమి రోజున) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. షిప్‌లు వెళ్లే సమయంలో బ్రిడ్జిని పైకి లేపే వర్టికల్ లిఫ్ట్ సాంకేతికతను ఈ బ్రిడ్జిలో వినియోగించారు. దేశంలో ఈ తరహా ఇంజినీరింగ్ టెక్నాలజీతో నిర్మించబడిన తొలి రైలు వంతెన ఇదే కావడం విశేషం. సుమారు 2.5 కిలోమీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మించబడింది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించి, తుప్పుపట్టకుండా ప్రత్యేక రసాయనంతో కోటింగ్ చేశారు. తమిళనాడులో ప్రధాని పర్యటన సందర్భంగా రూ.8,300 కోట్ల విలువైన రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేయనున్నారు. రామేశ్వరం నుంచి చెన్నై తాంబరం వరకు నూతన రైలు సర్వీసును కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఇది దేశ ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
Previous Articleవక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎమ్మెల్యే
Next Article కునాల్ కమ్రాకు షాక్…బుక్‌మైషోలో నుండి తొలగింపు…!