మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవంలో జరిగిన నిరసన ఘటనతో ఇద్దరు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు.రెడ్‌మోండ్‌లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కన్‌స్యూమర్ ఏఐ చీఫ్ ముస్తాఫా సులేమాన్ ప్రసంగిస్తుండగా,ఉద్యోగి ఇబితల్ అబొసాద్ ఆయనను అడ్డుకున్నారు. ఇజ్రాయిల్‌ను కస్టమర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.మరోవైపు,సత్య నాదెళ్ల,బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్ పాల్గొన్న కార్యక్రమంలో వనియా అగర్వాల్ నిరసన తెలుపుతూ క్యూఅండ్‌ఏ సెషన్‌ను అడ్డుకున్నారు.వీరిద్దరినీ మైక్రోసాఫ్ట్ కార్యాలయం వేదిక వద్దే వెళ్లిపోవాలని కోరింది.అబొసాద్‌కు టర్మినేషన్ లేఖ పంపించగా, అగర్వాల్ రాజీనామాను కంపెనీ తక్షణమే ఆమోదించింది. అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, మైక్రోసాఫ్ట్ అభిప్రాయ భేదాల కోసం ఉద్యోగుల చర్యలను అనుమతించదన్న సంకేతాలు పంపింది. ఇదే సమయంలో కంపెనీలో అభిప్రాయ స్వేచ్ఛపై చర్చలు మొదలయ్యాయి.
మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవంలో నిరసన – ఇద్దరు ఉద్యోగుల తొలగింపు…!
By admin1 Min Read

