సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శృతి చతుర్వేదికి అమెరికాలోని అలస్కా ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. పవర్ బ్యాంక్ అనుమానాస్పదంగా ఉందని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఎనిమిది గంటలపాటు నిర్బంధించారు. ఆమె వేసుకున్న గరం కోటును విప్పించి ఏసీ గదిలో కూర్చోబెట్టారు. శృతిని మహిళా సిబ్బంది కాకుండా మేల్ సెక్యూరిటీ తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వకపోవడంతో పాటు ఫోన్ ఉపయోగించనివ్వకపోయారట. ఈ వేధింపుల విషయాన్ని శృతి చతుర్వేది సోషల్ మీడియా వేదికగా భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను ట్యాగ్ చేస్తూ తనపై జరిగిన అన్యాయాన్ని వివరించారు. శృతి “చాయ్‌పానీ” అనే పబ్లిక్ రిలేషన్ సంస్థను నడుపుతూ పలు సమాజపరమైన అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ఆమెకు ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ పౌరులపై విదేశాల్లో ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. శృతి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతూ పలువురు సామాజిక కార్యకర్తలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు.
అమెరికా ఎయిర్‌పోర్టులో ఇన్‌ఫ్లూయెన్సర్ శృతి చతుర్వేదికి చేదు అనుభవం…!
By admin1 Min Read