అయోధ్యలో నిర్మించిన భవ్య రామాలయంలో, రామ్ దర్బార్ జూన్ 6న భక్తులకు అందుబాటులోకి రానున్నది. రాజా రామ్‌గా రాముడి విగ్రహాన్ని ఫస్ట్ ఫ్లోర్‌లో ప్రతిష్టించి,అదే రోజు నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. మే 23న ప్రత్యేక పూజలతో రాముడు, సీతా దేవి, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమాన్ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు.ఈ కార్యక్రమాలు నిరాడంబరంగా నిర్వహించబడనున్నాయి. జైపూర్ వైట్ మార్బుల్‌తో తయారైన 5 అడుగుల రాముడి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జూన్ 5న పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి.రామ్ దర్బార్ ప్రారంభంతో రామాలయ నిర్మాణం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు.ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలోని మరో ఏడు ఆలయాలు కూడా జూన్ 6 నాటికి సిద్ధం కానున్నాయి. వాటిలో మహర్షి వాల్మీకి ఆలయం ముఖ్యమైంది. భక్తులు ఎంతో ఆత్రుతగా ఈ పుణ్య దర్శనానికి ఎదురుచూస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు