భారత్ యునైటెడ్ అరబ్స్ తమ మధ్య రక్షణా సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. సైనిక పరికరాలు కలిసి డెవలప్ చేసే అవకాశాలు అన్వేషించాలని అంగీకారానికి వచ్చాయి. ఈమేరకు దుబాయ్ ప్రిన్స్ షేక్ హామ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మధ్య వేర్వేరుగా స్ట్రాటజిక్ రంగాల్లో సహాకారం లక్ష్యంగా చర్చలు జరిగాయి. భారత్ లో మక్తుమ్ ప్రత్యేక పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి బాటలు వేసిందని ప్రధాని మోడీ అన్నారు. ఇరువురి మధ్య సమావేశం జరిగింది. భారత్-యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అభివృద్ధికి దుబాయ్ కీలక పాత్ర పోషించిదని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. మక్తుమ్ ను కలవడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. ఇక రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా మక్తుమ్ తో విడిగా సమావేశమయ్యారు. రక్షణా రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మిడిల్ ఆసియా లో శాంతి, శ్రేయస్సు కోసం కృషి చేసేందుకు భారత్-యూఏఈ కట్టుబడి ఉంటాయన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు