భారత రక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.ఫ్రాన్స్‌తో కలిసి రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి భారీ ఒప్పందం కుదిరింది.ఈ డీల్ విలువ దాదాపు రూ.63,000 కోట్లు కాగా,ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ ప్రాతిపదికన జరుగనుంది.ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి 22 సింగిల్ సీటర్, 4 డబుల్ సీటర్ యుద్ధ విమానాలను భారత్ పొందనుంది.ఈ విమానాలు ముఖ్యంగా నౌకాదళ వినియోగం కోసం సిద్ధంగా ఉండనున్నాయి.విమానాల డెలివరీకి ముందు అవసరమైన శిక్షణ,సాంకేతిక మద్దతు కూడా ఫ్రాన్స్ అందించనుంది.ఈ డీల్‌పై అధికారికంగా సంతకాలు త్వరలో జరగనున్నట్లు వర్గాలు వెల్లడించాయి.రఫేల్ విమానాల సామర్థ్యంఇప్పటికే వైమానిక దళంలో పరీక్షించబడింది.ఇప్పుడు వాటి మెరైన్ వెర్షన్ నేవీలో చేరడం రక్షణ శక్తిని పెంచనుంది.ప్రస్తుతం కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ తో భారత్ భారీ ఒప్పందం…!
By admin1 Min Read
Previous Articleతిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పై ప్రధాని మోడీ ట్వీట్…స్పందించిన ఏపీ సీఎం
Next Article ఔషధ ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలు…?