తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలో మీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీ లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను తెలిపారు. రూ.1332 కోట్లతో డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ డబ్లింగ్ పనులతో టూరిజం పరంగా ఎంతో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. లక్షల సంఖ్యలో టూరిస్టులు వస్తారని తిరుపతి -శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట తిరుపతి -పాకాల-కాట్పాడి డబ్లింగ్ ప్రాంతంలో ఉన్నాయి. తిరుపతి -వెల్లూరు విద్యా వైద్యం పరంగా కీలక మార్గమని తెలిపారు. 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభాకు లబ్ది చేకూరుతుందని 35 లక్షల పనిదినాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. సంవత్సరానికి 4 లక్షల టన్నుల సరకు రవాణాకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు.
తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య రూ.1332 కోట్లతో డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
By admin1 Min Read
Previous Articleపీ4 అమలుకు రాష్ట్రస్థాయి సొసైటీ…చైర్‌పర్సన్‌గా సీఎం, వైస్ చైర్ పర్సన్ గా డిప్యూటీ సీఎం
Next Article నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..!