ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘జీరోపావర్టీ-పీ4’ కార్యక్రమాన్ని విస్తృత పరిచేందుకు… ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూసేందుకు ‘స్టేట్ లెవెల్ సొసైటీ’ని ఏర్పాటు చేస్తోంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్ పర్సన్‌గా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యంగా ఏపీలో పీ4 కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పీ4లో ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం ఉండనుంది. పేదల బాగుకు మార్గదర్శి-బంగారు కుటుంబం నినాదంతో ఈ అద్భుతమైన కార్యక్రమం రానుంది. పేదరికం నుంచి ప్రజలను పైకి తేవాలనేది పీ4 పథకం ముఖ్య ఆశయం. జీరో పావర్టీ-పీ4 లోగో, వెబ్ సైట్ ని ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఇటీవలే ఆవిష్కరించారు.
పీ4 అమలుకు రాష్ట్రస్థాయి సొసైటీ…చైర్‌పర్సన్‌గా సీఎం, వైస్ చైర్ పర్సన్ గా డిప్యూటీ సీఎం
By admin1 Min Read