బీహార్‌కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో భారీ ప్రమాదానికి కారణమయ్యేలా ప్రవర్తించాడు.ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పూర్ జిల్లాలో జరిగిన పార్టీకి వెళ్లిన ఆదర్శ్ రాయ్ తిరిగి తన గ్రామం గోపాల్‌పూర్‌కు బయలుదేరాడు.అయితే గూగుల్ మ్యాప్‌లో పూర్తి చిరునామా ఇవ్వకుండా కేవలం గ్రామం పేరు మాత్రమే ఎంటర్ చేయడంతో,మార్గం తప్పాడు.మద్యం మత్తులో ఉన్న ఆదర్శ్ లక్నోలోని డోమింగర్ సమీపంలో రైల్వే ట్రాక్‌పైకి కారును నడిపించాడు.రైలు పట్టాలపైకి వెళ్లిన కారుకు టైర్లు కంకర రాళ్లలో చిక్కుకుపోయాయి.ఇదే సమయంలో ఆ దారిలో గూడ్స్ రైలు వస్తుండగా, అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఐదు మీటర్ల దూరంలో రైలు ఆగింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది, స్థానికుల సహాయంతో కారును ట్రాక్‌పై నుంచి తొలగించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న ఆదర్శ్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు