ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.కూటమి నేతలను ఉద్దేశించి “నరికేస్తాం” అనే రెచ్చగొట్టే మాటలతో వ్యాఖ్యానించడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా స్పందించారు.కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యానీ, అడకా శ్రీను గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదును పరిశీలించి, కారుమూరిపై కేసు నమోదు చేశారు. త్వరలోనే విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ నైతికతకు భిన్నమని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Previous Articleరాజస్థాన్:- హాట్ ఎయిర్ బెలూన్ నుండి క్రింద పడి వ్యక్తి మృతి…!
Next Article విక్టరీ డే పరేడ్‌కు ప్రధాని మోదీకి రష్యా ఆహ్వానం …!