సమర్థత, ప్రభావవంతమైన పరిపాలన, సుస్థిరత, పురోగతి దిశగా పడే గొప్ప ముందడుగుగా ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను చూడాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జాతీయ ప్రయోజనాలను, సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీల నేతలు… ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను అధ్యయనం చేయాలని, దేశమంతా ఒక అభిప్రాయానికి రావాలన్నది తన ఆకాంక్షని పేర్కొన్నారు. తిరుపతి లోని కచ్ఛపి ఆడిటోరియంలో ఒకే దేశం- ఒకే ఎన్నిక ఆంధ్రప్రదేశ్ బృందం… దేశంలో ఏకకాల ఎన్నికల అవసరాన్ని వివరించడానికి, నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రభావం గురించి చర్చించడానికి నిర్వహించిన ప్రత్యేక సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక ఆలోచన ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉన్నదేనని పేర్కొన్నారు . దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అమలు చేసినదే.కొంత మంది రాజకీయ కారణాలతో జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల దీర్ఘాకాలికంగా దేశానికి, రాష్ట్రాలకు మేలు చేకూర్చే గట్టి నిర్ణయాలను తీసుకోవడానికి వీలవదని వాటి వలన కలిగే ప్రభావాలను వివరించారు. జమిలి ఎన్నికల విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిస్తూ… యువత ఈ విషయాన్ని అర్థం చేసుకుని, నవ భారత నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు.
ఒకే దేశం- ఒకే ఎన్నిక ఆలోచన ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉన్నదే: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
By admin1 Min Read