అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పులో అరెస్టు సమయంలో కారణాలు తెలియజేయకపోతే అది రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించాలన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం, అరెస్టైన వ్యక్తికి కారణాలు స్పష్టంగా,అతడికి అర్థమయ్యే భాషలో తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంజీత్ సింగ్‌పై ఫిబ్రవరిలో నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేసినపుడు కారణాలు తెలపలేదని పిటిషన్ దాఖలైంది.ఈ నేపథ్యంలో 2024 డిసెంబర్ 26న జారీ చేసిన రిమాండ్ ఆర్డర్‌ను హైకోర్టు రద్దు చేసింది.మంజీత్ సింగ్ అరెస్ట్‌ను ఏప్రిల్ 9న హైకోర్టు నిలిపివేసింది.చట్టబద్ధమైన పరిమితులు ఉన్నా,మౌలిక హక్కుల ఉల్లంఘన జరిగితే బెయిల్ మంజూరు సాధ్యమవుతుందని పేర్కొంది.న్యాయమూర్తులు మహేష్ చంద్ర త్రిపాఠి, ప్రశాంత్ కుమార్‌ల నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది.అరెస్టు సమయంలో వ్యక్తికి వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది.ఈ తీర్పు మౌలిక హక్కుల పరిరక్షణలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.అయితే ఈ ప్రక్రియలో పారదర్శకత,న్యాయనిర్ణయాలకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
అరెస్ట్ సమయంలో కారణాలు తెలియజేయకపోతే బెయిల్ ఇవ్వచ్చు : అలహాబాద్ హైకోర్టు
By admin1 Min Read