ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆవిష్కరించిన అయ్యప్పస్వామి రూపం ఉన్న గోల్డ్ లాకెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీ.ఎన్. వాసవన్ పవిత్ర విషు పర్వదినం సందర్భంగా నిన్న ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తుడు ఆన్ లైన్ ద్వారా మొదటి లాకెట్ ను కొనుగోలు చేశారు. శబరిమల ఆలయ గర్భగుడిలో పూజించిన ఈ లాకెట్లను దేవస్థానం భక్తులకు అమ్ముతోంది. అయ్యప్ప 2 గ్రాముల లాకెట్ రూ.19,300, 4 గ్రాముల లాకెట్ రూ.38,600, 8 గ్రాముల లాకెట్ రూ.77,200గా నిర్ణయించారు.
శబరిమలలో గోల్డ్ లాకెట్స్ విక్రయాలు ప్రారంభం… మొదటి లాకెట్ అందుకున్న ఏపీ భక్తుడు
By admin1 Min Read

