ఇంకా ఎన్నాళ్లు ఆడతాడు, జట్టుకు భారంగా మారాడు అని వస్తున్న విమర్శలకు తన ఆటతీరుతో ధీటైన సమాధానం ఇచ్చాడు భారత మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సీనియర్ ఆటగాడిగా, కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. కీపింగ్ లో బ్యాటింగ్ లో సత్తా చాటాడు. 11 బంతుల్లోనే 26 పరుగులు చేసి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్ (43 ఏళ్ల 281 రోజులు)గా ధోనీ నిలిచాడు. ఇదివరకు ఈ రికార్డు స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (43 ఏళ్ల 60 రోజులు) పేరిట ఉండేది. ఇక మరిన్ని రికార్డులు తన పేరిట లిఖించాడు. ఐపీఎల్‌లో 200 డిస్మిసల్స్ (స్టంపౌట్లు, రనౌట్లు, క్యాచ్‌లు) చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. అలాగే లీగ్ ప్రారంభం నుండి అత్యధిక ఇన్నింగ్సుల్లో (132) సిక్సర్లు కొట్టిన బ్యాటర్ కూడా ధోననే. అలాగే ఐపీఎల్‌లో అత్యధిసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ధోనీకి 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వచ్చాయి. ఈ లిస్టులో రోహిత్ శర్మ (19) అగ్రస్థానంలో ఉన్నాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

