ఉత్తరప్రదేశ్‌లో దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించిన జడ్జినే పట్టుకునేందుకు ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రయత్నించారు.దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది.కాగా 2012లో ఫిరోజాబాద్‌లో జరిగిన దొంగతనానికి సంబంధించి నిందితుడు రాజ్‌కుమార్ వురపు పప్పుపై అనేక నాన్‌బెయిలబుల్ వారంట్లు ఉన్నాయి.అతనిని పట్టుకోవాలని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నగ్మా ఖాన్ సీఆర్పీసీ సెక్షన్ 82 ప్రకారం ఆదేశాలు జారీ చేశారు.అయితే,ఆ కేసులో చర్యలు తీసుకోవాల్సిన ఎస్‌ఐ భన్వరిలాల్ ఓ తీవ్రమైన తప్పిదం చేశారు.నిందితుని స్థానంలో జడ్జినే తప్పుగా గుర్తించి, ఆమెను ప్రోక్లమేషన్ ఆర్డర్ కింద నిందితురాలిగా పేర్కొన్నారు.జడ్జి నివాసానికి వెళ్లి ఆమె అక్కడ లేరని రాసి కోర్టుకు నివేదిక సమర్పించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు ఎస్‌ఐ భన్వరిలాల్‌ను విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేల్చి, అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సంఘటన పోలీసు వ్యవస్థలో శ్రద్ధ మరియు జాగ్రత్తల అవసరాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు