దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,577 పాయింట్ల లాభంతో 76,734 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 515 పాయింట్ల లాభంతో 23,328 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.80గా కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్ లో టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ సహా పలు షేర్లు లాభాలతో ముగిశాయి. బీ.ఎస్.ఈలో నమోదిత కంపెనీల విలువ ఒక్క రోజులో 8.7 లక్షల కోట్లు పెరిగి రూ.410.24 లక్షల కోట్లకు చేరింది. వివిధ దేశాలపై తాత్కాలికంగా రెసిప్రోకల్ టారిఫ్స్ ను ఇటీవలే వాయిదా వేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ ను ఆ టారిఫ్ ల లిస్ట్ నుండి తొలగిస్తూ చేసిన ప్రకటన మార్కెట్లకు కొత్త జోష్ ఇచ్చింది.
Previous Articleజడ్జినే నిందితుడిగా భావించిన ఎస్‌ఐ…!
Next Article కేజీఎఫ్ 3లో అజిత్ ఎంట్రీ అంటూ న్యూస్ వైరల్..?