దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.సోమవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, “ఢిల్లీ వాతావరణంలో కేవలం మూడు రోజులు ఉన్నా… వ్యక్తికి ఇన్‌ఫెక్షన్లు రావడం ఖాయం” అని స్పష్టం చేశారు.వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల ఆయుష్షు 10 ఏళ్ల వరకూ తగ్గుతుందనే విషయం దురదృష్టకరమని అన్నారు.ఢిల్లీతో పాటు ముంబై కూడా రెడ్ జోన్ పరిధిలో ఉందని పేర్కొన్నారు.పర్యావరణ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని,జీవావరణంపై మనం తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.“ఆర్థిక అభివృద్ధికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో,అదే స్థాయిలో ఎకాలజీ, ఎథిక్స్ కు కూడా ఇవ్వాలి,” అని అన్నారు.భారత్ రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటుందని,పెట్రోల్, డీజిల్ వాడకమే వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.వీటికి పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడం అత్యవసరమన్నారు.
ఢిల్లీ వాయు కాలుష్యం ప్రమాదకరం – 3 రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్లు వచ్చే పరిస్థితి:కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
By admin1 Min Read